ఉగాది నాటికి జగనన్న కాలనీలో గృనిర్మానాలు పూర్తి చేసుకోవాలని మాకవరపాలెం ఎంపీడీవో అరుణశ్రీ లబ్ధిదారులకు సూచించారు. శనివారం మాకవరపాలెం తామరం, గిడుతూరు గ్రామాల్లో జరుగుతున్న జగనన్న కాలనీలో ఇల్లు నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకొని కొత్త కాలనీల్లో గృప్రవేశాలు చేయాలన్నారు. ఆయా కాలనీల్లో మౌళిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేఈ రామలింగస్వామి, విద్యుత్ శాఖ జేఈ బాలకృష్ణ, గ్రామసచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు బాలకృష్ణ పాల్గొన్నారు.