బకాయి పడ్డ 2 నెలల జీతాలు తక్షణమే ఇవ్వాలి


Ens Balu
34
Munchingi Puttu
2023-02-04 14:08:04

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల  స్థానిక కళ్యాణ మండపంలో శనివారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయలకు రెండు నెలల పాటు బకాయి పడ్డ జీతాలను చెల్లించాలని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కే శంకర్రావు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయలకు గత రెండు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమత పడుతున్నారని, కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని, పేష్ యాప్ ను రద్దుచేసి అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అంగన్వాడి సిబ్బందికి పర్యవేక్షణ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారని, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టీఏడీఏ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈనెల 6న పాడేరు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం ఎం శ్రీను, రాందాస్, అంగన్వాడి కార్యకర్తలు భవాని, సుజాత, దేవి, ఆయాలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
సిఫార్సు