అరకు నియోజకవర్గం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త తప్పకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సభ్యులు సోనియా అప్పలస్వామి సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు కొండంత అండగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో జనసేన పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్, కార్యకర్తల భరోసా కోసం ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి బాసటగా నిలవాలని రూ.5లక్షల ప్రమాద బీమాపథకం వర్తించే విధంగా ప్రణాళిక సిద్ధంచేసి కార్యకర్తలను ఆదుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు. ఈనెల 10 నుండి 28 వరకు మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. జనసైనికులందరూ తప్పక నమోదుచేసుకోవాలన్నారు.