విశాఖలో జనసేన దక్షిణ నియోజకవర్గంలో 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు
అల్లిపురం కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయకలయిక
ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ఎంతో నిబద్ధత కలిగిన పార్టీ అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన కందులు నాగరాజుకి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి తామంతా కృషి చేస్తామని అన్నారు. కందుల నాగరాజు మాట్లాడుతూ, కెఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో మరింత సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, బొడ్డేపల్లి రఘు, సంకు వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.