కోటనందూరు స్కూలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


Ens Balu
9
Kotananduru
2023-02-06 10:38:42

కోటనందూరు పిహెచ్సీ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు కార్యక్రమం కింద చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, విద్యా బోధన, రైజ్ కార్యక్రమం అమలు తీరు, సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్లు నిర్వహణ, మధ్యాహ్నం భోజనం తయారీ తదితరాలను పరిశీలించి అధికారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 8,9 వ తరగతి చదువుతున్న విద్యార్థులతో కలెక్టరు కృతికా శుక్లా ముచ్చటించి ఇటివల విద్యార్థులకు అందించిన ట్యాబ్స్ వినియోగం వివరాలు అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. రైజ్ కార్యక్రమం ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్న విశేషాలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహారీ గోడ, ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ లంక ప్రసాదు, కలెక్టరు వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్ రెడ్డి, పెద్దాపురం ఆర్డీవో జే సీతారామరావు, ఇంచార్జ్ డీఈవో ఆర్జే.డానియేల్ రాజు, కోటనందూరు తహసీల్దార్ జీ.బాలసుబ్రమణ్యం, ఎంపీడీవో ఎస్ఎస్.శర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.వెంకట చౌదరి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు