అత్యాచార బాధితురాలికి అన్నివిధాలా న్యాయ చేస్తాం


Ens Balu
1
2020-07-03 14:01:40

అత్యాచారానికి గురైన బాధిత గిరిజన బాలికకు అన్నివిధాల న్యాయం జరిగేలా చూస్తామని ఐటిడిఎ పిఒ డా.వెంకటేశ్వర్ సలిజామల హామీ ఇచ్చారు. జి.మాడుగుల మండలం కె. కోడాపల్లి పంచాయతీ జన్నేరు గ్రామంలో బాలికపై అత్యాచారం ఘటనపై గురువారం పాడేరులో గిరిజన సంఘం రాష్ట్ర నేత అప్పలనర్సతోపాటు ఆ సంఘం జిల్లా నాయకులు కె.పృథ్వి, దీనబంధు, బాధిత కుటుంబ సభ్యులు పిఒను కలసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ..ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేశారని, మిగతా ముగ్గురుపై కూడా అవకాశమున్న అన్ని కేసులు నమోదుకు డిఎస్ పితో మాట్లాడుతానన్నారు. బాధిత బాలికకు ఉద్యోగ వయస్సు నిండిన తర్వాత ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారంపై గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ తో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధిత కుటుంబం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా తెలపాలని వారితో చెప్పారు.