బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరిగిన విషయాన్ని ప్రకటించింది. తులం బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440 ఉంది. వెండి కిలో రేటు రూ.74,000లో ఎలాంటి మార్పు లేదు. కాగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతీ మూడు రోజులకు ఒకసారి పెరుగుతూ వస్తుండటం మదుపరులపై ప్రభావం చూపిస్తున్నది.