అన్నవరానికి రూ.2.26కోట్లు జల్ జీవన్ మిషన్ నిధులు


Ens Balu
20
Annavaram
2023-02-09 07:16:12

అన్నవరం  పంచాయతీకి రూ.2.26 కోట్లు జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు అయ్యాయని సర్పంచ్ ఎస్.కుమార్ రాజా తెలియజేశారు. గురువారం ఆయన పంచాయతీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీపూర్ణచంద్రప్రసాద్ క్రుషితో ఈ నిధులు మంజూరు అయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈనిధులతో గ్రామంలో మూడు మంచినీటి ట్యాంకులతోపాటు, అన్ని కాలనీలకు నూతన కుళాయిలు వేయించున్నట్టు చెప్పారు. అంతేకాకుండా రెండు పూటలా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. గ్రామంలోని ప్రాధాన్యత ప్రాంతాల్లో వార్డు సభ్యులు కుళాయిల అవసరాలను ఇప్పటికే గుర్తించినట్టు చెప్పారు. జల్ జీవన్ మిషన్ నిధులతో అన్నవరం గ్రామంలో మంచినీటి కొరత, కొత్త కుళాయిలు, మంచినీటి పథకాల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని సర్పంచ్ వివరించారు.


సిఫార్సు