వినియోగదారులను దోపిడీ నుంచి రక్షించడానికి వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వినియోగదారుల కమిషన్ మీడియేషన్ సభ్యులు కొమ్మూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని రమణయ్యపేట ఇందిరా కాలనీలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నష్టపోయిన వినియోగదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించడానికి చట్టం రూపొందించారని అన్నారు. వస్తువు కొన్న తర్వాత సేవలు అందించకపోయినా, అసంతృప్తి సేవలకు కూడా పరిహారం పొందవచ్చు అని అన్నారు. ప్రతికోనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు తీసుకున్నప్పుడే వినియోగదారుడికి హక్కు వస్తుందని శ్రీనివాస్ తెలిపారు . అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.