ఉదరకోశంలో అనేక ఆమ్లాలు ఉత్పత్తి అయి నోటిలోకి వస్తాయని దీంతో దంతాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ వెదురుపాక సతీష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దంతాలలో డెంటిన్ అనే సున్నితమైన బాగా ఉంటుందని ఇది దెబ్బతిన్నప్పుడు దంతాలలో రంధ్రాలు పడతాయని అన్నారు. దీనివలన వేడి ,చల్లని ,తీపి పదార్థాలు తిన్నా ,తాగినా బాధ కలుగుతుందన్నారు. దంతాలు గార పడటంతోపాటు పంటి మీద పింగాణీ పొర దెబ్బతింటుంది అని అన్నారు. శీతల పానీయాల వలన కూడా దంతాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.