అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ రైతుల బకాయిలు ఐటీడీఏ చెల్లించేవరకూ ఉద్యమం ఆపేది లేదని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోమ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. గురువారం ముంచం పుట్టు మండలంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2017 నుండి రైతులకు రావలసిన కాఫీ బకాయి సుమారు 60 కోట్ల పైచిలుకు ఉందని ఈ బకాయి చెల్లించడంలో ఐటిడిఏ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుండి ప్రోత్సహం రైతులకు లేకపోవడం వల్లనే కాఫీ పంటకు అంతరాయం ఏర్పడి.. రైతులు భూములు ఖాళీగా ఉండిపోయాయన్నారు. లక్ష్యం పురం సర్పంచ్ కొర్ర త్రీనాథ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉన్న మన అరకు ఆర్గానిక్ కాపీని అభివృద్ధి చేయడంలో ఐటిడిఏ చొరవ చూపించాలని రైతులకు ఇవ్వవలసిన ప్రోత్సహకం ఇస్తూ కాఫీ సాగులో ఉన్న అటవీ భూములకు పోడుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండించిన కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్లు అందించి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కాఫీ మిరియాలు రైతులకు ఉచితంగా నిచ్చెనలు కట్టర్లు తరఫున పంపిణీ చేయాలని కాఫీ రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్నారు. జిసిసి ద్వారా రుణాలు కాపీ పంట మిరియాలు కొనుగోలు చేయాలని అనేక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం 17వ తారీఖున పాడేరు ఐటిడిఏ వద్ద ఉద్యమం చేపడుతున్నామని పేర్కొన్నారు. అంతకుము సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.నర్సయ్య, మండల అధ్యక్ష కార్యదర్శి లు నారాయణ ఎంఎం .శ్రీను , కాఫి రైతులు సంఘం కన్వీనర్ గాసిరం శంకర్ దోంబ్రు దిన్నబంద్ గణపతి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ కాఫి రైతులు పాల్గొన్నారు.