విద్యార్ధులకు క్రమంతప్పకుండా వైద్యపరీక్షలు చేయాలి


Ens Balu
17
Minumuluru
2023-02-09 13:57:02

పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీ  పరిధిలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ  పాఠశాల (బాలిక) శ్రీకృష్ణ పురం లో చదువుతున్న  విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు  నిర్వహించినట్టు పాడేరు అదనపు జిల్లా   వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె లీలాప్రసాద్ తెలియజేసా రు.   జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మినుములూరు సిబ్బంది 617 మంది విద్యార్థినులలో 603 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.  వీరిలో 32 మంది రక్తహీనత, చర్మ వ్యాధులు, దగ్గు, తక్కువబరువు, కంటి చూపు మరియు చెవి, దంత సమస్యలు  మున్నగు వ్యాధులతో బాధపడుతున్న వారికి పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని 4 మంది విద్యార్థినులకు ఇతర పరీక్షల కొరకు జిల్లా ఆసుపత్రి పాడేరులో తరలించి తదుపరి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అనుమానిత సికిల్ సెల్ అనీమియా కేసులను గుర్తించి తదుపరి పరీక్షల కొరకు జిల్లా ఆసుపత్రి పాడేరు తరలించి తదుపరి నిర్ధారణ పరిక్షలు జరిపించాలని సూచించారు.  వైద్యాధికారులు  క్షేత్ర స్ధాయి  సిబ్బంది శిబిరాల్లో పాల్గొనాలన్నారు. అనంతరం కిచెన్ గదిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. శిబిరంలో జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టి.బి అధికారి డా. టి.విశ్వేశ్వరరావు గారు,   వైద్యాధికారి డా. కె బాబ్జి, పాడేరు జిల్లా ఆసుపత్రి ఆర్.బి.ఎస్.కె మేనేజర్ కిషోర్,  ఫిజియోథెరిపిస్టు మౌనిక, పాడేరు పి.ఓ డి.టి.టి కార్యాలయ ఆరోగ్య విస్తరణ అధికారి బి లక్ష్మణ్ ,  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ  (బాలికల) పాఠశాల శ్రీకృష్ణ పురం  ఉపాధ్యాయినులు, ఇతర వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.
సిఫార్సు