వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో మనం ఖర్మ అనుభవిస్తున్నాం


Ens Balu
13
Paderu
2023-02-12 07:09:55

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఖర్మ అనుభవిస్తున్నారని మాజీ మంత్రి మత్యరాస మణి కుమారి పేర్కొన్నారు. ఆదివారంపాడేరు నియోజకవర్గంలోని గొండెలి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్  యంవివి.ప్రసాద్ కలిసి  ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇంటింటికి వెళ్లి తెలియజేశారు. అనంతరం ఇదే గ్రామంలో వికలాంగుల పింఛను కోల్పోయిన రొబ్బ లక్ష్మమ్మ, బొయిని పోలమ్మ లను పరామర్శించి, అల్లూరి జిల్లా కలెక్టర్ దృష్టికి తొలగించిన పెన్షన్ విషయం తీసుకెళ్లి వెంటనే పునరుద్ధరణ చేస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు, మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి,  స్థానిక నాయకులు కిముడు నారాయణ నాయుడు,  కిముడు రామలింగం నాయుడు, రొబ్బ బొంజుబాబు , బాలయ్య దొర, ఉమామహేశ్వర నాయుడు, దళపతి రాజయ్య, ఈశ్వర్ నాయుడు  అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఫార్సు