సోమవారం జివిఎంసీలో “స్పందన”
Ens Balu
15
Visakhapatnam
2023-02-12 14:35:44
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ లో సోమవారం ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కమిషనర్ పి రాజబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని జివిఎంసి ప్రధాన కార్యాలయంలో జరుగుతుందన్నారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కమిషనర్ మీడియాకి విడుదల చేసిన ప్రకటన లో పేర్కొన్నారు. జివిఎంసీతోపాటు, అన్ని వార్డులలోని వార్డు సచివాలయాలు, జోన్ కమిషనరేట్లలో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.