అరసవెల్లి స్వామి వారి హుండీ లెక్కింపు
Ens Balu
9
అరసవెల్లి
2023-02-13 07:15:53
శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను ఫిబ్రవరి 14న లెక్కించనున్నట్లు సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాకి ఒక ప్రకటన విడుదల చేసారు. మంగళ వారం ఉదయం 08.00గం.లకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనువంశిక ధర్మకర్త,అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరిచి, నిబంధనల ప్రకారం లెక్కింపు జరుపుతామన్నారు. ఆ మొత్తాలను స్వామివారి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు చెప్పారు. ఈ లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.