సిరియా బాధితులకు గాజువాక ముస్లింల సహాయం
Ens Balu
192
Gajuwaka
2023-02-13 08:27:43
టర్కీ, సిరియా భూకంప బాధితులకు తమ వంతు సహాయాన్ని విశాఖ జిల్లా గాజువాక ప్రాంత ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆపన్న హస్తాన్ని స్ఫూర్తిగా తీసుకుని వైజాగ్ గాజువాక ఆల్ ముస్లిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు రూ.1.80క్షలు నగదుతోపాటు, రెండు టన్నుల రిలీఫ్ మెటీరియల్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గాజువాక అజీమాబాద్ దీనియత్ ట్యూషన్ సెంటర్ వద్ద రిలీఫ్ మెటీరియల్ తో బయలుదేరిన వాహనాలను ఫెడరేషన్ అధ్యక్షుడు షాహిద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూకంప బాధితులను ఆదుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హయాజ్ అలీ, నశీర్, జాఫర్, ఫరూక్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.