కాకినాడజిల్లాలో చంద్రబాబు పర్యటన జయప్రదంచేయాలి


Ens Balu
15
ప్రత్తిపాడు
2023-02-13 11:55:23

కాకినాడ జిల్లాలో టిడిపి అధినేత, జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని ప్రత్తిపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా ఒకప్రకటనలో కోరారు. ఈ మేరకు ఆయన ప్రత్తిపాడు నియోజకవర్గ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 15 న  తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జగ్గంపేటలో జరిగే భారీ బహిరంగ సభకు సాయంత్రం ఐదు గంగలకు హాజరవుతారని అన్నారు. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు  పెద్ద సంఖ్య లో ఈ సభకి హాజరై కార్యక్రమాన్ని జయప్రదం  చేయాలని కోరారు. అంతేకాకుండా  ఈ నెల 16 న సాయంత్రం 5 గంటలకు పెద్దాపురం లో  కూడా  చంద్రబాబు భారీ  బహిరంగ సభ  ఏర్పాటుచేశారని ఆ సభను కూడా విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే నియోజవర్గంలోని అన్ని మండలాల నాయకులకు సమాచారం పంపించినట్టు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
సిఫార్సు