ప్రజా వ్యతిరేక వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
Ens Balu
8
Chintapalle
2023-02-13 12:27:45
రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న ప్రజావ్యతిరేక వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం.వి.వి.ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం అంజలి శనివారం గ్రామంలో ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం చర్యల వలన పన్నుల భారం ప్రజలపై పుడుతుందన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం మళ్లీ టిడిపిని అధికారంలోకి తెచ్చుకో వాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వంజంగి కాంతమ్మ, మాజీ అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి , మాజీ మండల అధ్యక్షులు బేరా సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు కిముడు లక్ష్మ య్య, మాజీ యం.పి.టి.సి పొత్తూరు రామారావు, వైస్ సర్పంచ్ కుమారి, శ్యాం సుందర్, నారాయణరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.