ఓవర్ లోడ్, అతివేగంతో వెళితే చర్యలు తప్పవు..


Ens Balu
7
ప్రత్తిపాడు
2023-02-13 13:57:18

అతివేగం, ఓవర్ లోడుతో వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్తిపాడు సిఐ కె.కిషోర్ బాబు వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు భద్రత చర్యలలో భాగంగా సోమవారం ప్రత్తిపాడు నుండి ఏలేశ్వరం రోడ్ మార్గంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న వాహన డ్రైవర్లకు, ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించు కోరాదని, తప్పని సరిగా యూనిఫాం ధరించాలని అన్నారు. అదేవిధంగా అన్ని రికార్డు లు కలిగి ఉండాలని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను ఎక్కించుకొరాదనీ, ప్రయాణీకులు కూడా కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణాలు చేయకూడదన్నారు. పరిమిత వేఘం పాటించాలని సూచించారు. ఏ ఒక్కరు నిబంధనలను అతిక్రమించినా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని వాహనాలకు జరిమానాలు కూడా విధించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


సిఫార్సు