కౌ హగ్ డే కి ప్రాధాన్యత పెంచడం అందరి బాధ్యత
Ens Balu
15
Simhachalam
2023-02-14 04:49:15
కౌ హగ్ డేకి ప్రాధాన్యత కల్పించడం ద్వారా గోవుల యొక్క ప్రాముఖ్యత విశ్వవ్యాప్తం అవుతుందని సామాజిక కార్యకర్త విజిగిరి బాలభానుమూర్తి అన్నారు. మంగళవారం సింహాచలం గోసాలలో ఈ సందర్భంగా గోవులను హత్తుకొని కౌ హగ్ డే ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతినిత్యం గోవుల నుంచి వచ్చే పాలను, వెన్నను, నెయ్యిని, మజ్జిగను మనం సేవించి ఆరోగ్యం పొందుతున్నామని, అదేవిధంగా గోవుల పేడ, గోమూత్రంతో సేంద్రియ ఎరువుగా నేల సారవంతం అవుతుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. గోవులను దేవతలుగా పూజించే భారతదేశంలో కౌ హగ్(గోవును హత్తుకోవడం)ను అలవాటు చేసుకోవాల న్నారు. తద్వారా ప్రేమాభిమానాలు, జంతుప్రేమ విలువ మరింత మందికి చేరువ అవుతుందని చెప్పారు. భారతీయ సంస్కృతికి గోవులు వెన్నెముకని, గోవులు, మూగ ప్రాణుల పట్ల తమకు ఉన్న అనుబంధాన్ని చాటుకోవడం లో సంస్కృతిలో ఒక భాగం అని గుర్తు చేశారు.