వైభవంగా శ్రీ రామచంద్ర అమ్మవారి పండుగ


Ens Balu
24
Paravada
2023-02-14 08:14:31

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ రామచంద్ర అమ్మవారని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎయిర్ పోర్టు సలహా మండలి సభ్యులు, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం పరవాడ మండలంలోని వాడచీపురుపల్లి, దళాయపాలెం పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత శ్రీ రామచంద్ర అమ్మవారి తల్లి పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని  శ్రీనుబాబు కుటుంబ సభ్యులు దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి అమ్మవారు భక్తులపాటి కొంగుబంగారమని ఎంతో మహిమాన్విత మాతగా అభివర్ణించారు. ఆలయ ఆవరణలో భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు అత్యంత ప్రశంసనీయముగా ఉన్నాయని అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీనుబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
సిఫార్సు