నిస్వార్థ ప్రజా సేవకుడు దామోదరం సంజీవయ్య


Ens Balu
10
Kakinada
2023-02-14 08:25:37

స్వతంత్ర భారతదేశంలో తొలితగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిస్వార్ధంగా సేవలు అందించారని గ్రంథాలయ విశ్రాంతి ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు.  మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో ఆయన జన్మించారని అన్నారు. ముఖ్యమంత్రిగా 6 లక్షల ఎకరాలను పేదలకు పంచారన్నారు. వితంతువులు, వృద్ధులకు ప్రతినెల పెన్షన్ చెల్లించే పథకాన్ని ప్రవేశపెట్టి, అవినీతిని  నిర్మూలించడానికి ఏసీబీను ఏర్పాటు చేశారన్నారు .ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉపాధ్యాయులకు కూడా పెన్షన్ చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆయన పేరుమీద స్టాంపు కూడా విడుదల  అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, రాజా ,రేలంగి  బాపిరాజు,  ఎస్. శ్రీ నగేష్  పాల్గొన్నారు.
సిఫార్సు