నేమం గ్రామంలో పడకేసిన పారిశుధ్యం..


Ens Balu
26
కాకినాడ రూరల్
2023-02-14 15:08:14

కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామపంచాయతీ పరిధి ఎల్విన్ పేట పరిసర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది.  కాలువలలో పూడికల తీయకపో వడంతో దోమలు పెరిగి వివిధ రోగాలు స్థానికులు జ్వరాల భారిన పడుతున్నాయి.  పబ్లిక్ కుళాయిల నుండి  వచ్చే నీరు కూడా ప్రజల పట్టుకోడానికి వీలు లేకుండా మురి కి కాలువలతో నిండిపోయి ఉన్నాయి.  గ్రామపంచాయతీలో సేకరించిన చెత్తని కొమరగిరి వెళ్లే రహదారిలో పోయిటవలన ఆ రహదారి  నుండి ప్రయాణించాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. గ్రామపంచాయతీ విస్తరణ అధికారి ఏం చేస్తున్నట్టో తెలియడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. హరిజనపేట ప్రాంతంలో పాఠశాల నిర్మాణంలో ఉండటంతో పక్కనే ఉన్న సామాజిక భవనంలో వారి స్కూలు ఏర్పాటు చేశారు. ఈ వేసవికాలంలో పిల్లలు చదు వుకునేలాగా చుట్టూ పరదాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము డిమాండ్ చేశారు.
సిఫార్సు