వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్
Ens Balu
38
Paderu
2023-02-14 15:55:39
ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, గిరిజనులకు ద్రోహం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి అన్నా రు. మంగళవారం పాడేరు మండలం మోదపల్లి పంచాయతీలో మోదా పెళ్లి, రాజాపురం, బుర్ర గరువు గ్రామాల్లో టిడిపి పాడేరు నియోజకవర్గం సీనియర్ నాయకులు బుర్ర నాగరాజు, కొట్టగుళ్లి సుబ్బారావు అధ్యక్షతన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబా బునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పా గిరిజనులకు మేలు జరగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిసిసి చైర్మన్ ప్రసాద్ , ఎక్స్ జెడ్పి చైర్మన్ వంజంగి కాంతమ్మ, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్లి సుబ్బారావు, బుర్ర విజయ రాణి, బాకూరి బాలరాజు, వణుకు దేవుడు రాములమ్మ వినోద్ నాయుడు, బారా సత్యనారాయణ, స్థానిక యువతి యువకులు పాల్గొన్నారు.