బైజూస్ యాప్ పై ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి
Ens Balu
10
Cheepurupalli
2023-02-15 07:43:26
బైజూస్ యాప్ వినియోగం పై ఉపాధ్యాయులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ఈ యాప్ ద్వారా సోషల్ స్టడీస్ ను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను నిర్వహించాలని డి.ఈ.ఓ లింగేశ్వర రెడ్డి కి సూచించారు. మంగళవారం కలెక్టర్ చీపురుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ను డి.ఈ.ఓ తో కలసి సందర్శించారు. 10 వ తరగతి పిల్లలు పరీక్షల కోసం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నది వారితో మాట్లాడి తెలుసుకున్నారు. బై జ్యూస్ యాప్ ఎలా ఉపయోగపడు తున్నదీ అడిగారు. 10 వ తరగతి లో అందరూ మంచి రాంక్ లలో పాస్ కావాలని అన్నారు. పాఠశాలలోనే కెరీర్ గైడెన్స్ తరగతులను నిర్వహించాలని హెచ్.ఎం.కు సూచించారు. బాలికలతో మాట్లాడుతూ సఖి బృందాల సమావేశాలకు హాజరావుతున్నారా అని ప్రశ్నించారు. పాఠశాలల్లో, హాస్టళ్ల లో జరుగుతున్న సఖి సమావేశాలకు బాలికలంతా తప్పకుండా హాజరు కావాలన్నారు.