కేజీహెచ్ ద్వారా మెరుగైన సేవలు అందించండి..


Ens Balu
5
Visakhapatnam
2023-02-15 11:10:42

ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా సేవలు అందజేస్తున్న కింగ్ జార్జ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన సేవలు మరింతగా అందించాలని నేవల్ డాక్ యార్డ్ కేటిబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. బుధవారం కేజీహెచ్ సూపరింటెండెంట్  డా.పి. అశోక్ కుమార్ ను అసోసియేషన్ సభ్యులు బృందం మర్యాదపూర్వకంగా కలిసి సింహాద్రినాధుని జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబుతో పాటు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సూపర్డెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలతో పాటు వసతి సౌకర్యాలు కూడా మరింతగా మెరుగుపడ్డాయి అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో రోగులకు మరింత సేవలు అందించేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అద్యక్షులు బత్తుల చిరంజీవి,  రమణ , తదితర సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

సిఫార్సు