సారా బట్టీలపై ప్రత్తిపాడు ఎస్ఈబీ సిఐ మెరుపు దాడులు
Ens Balu
14
Prathipadu
2023-02-16 10:21:49
ప్రత్తిపాడు మండలం గోకవరం అటవీ ప్రాంతంలోని సారాబట్టీలపై గురువారం ప్రత్తిపాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. అశోక్ సారా బట్టి ఫై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటు సారా కాస్తున్న రామోజీ కన్నారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లుగా ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, గుట్టు చప్పుడు కాకుండా సారా కాస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. పరారైన వ్యక్తి శంఖవరం మండలం పెద్దమల్లపురం వాసిగా ర్తించామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నుంచి 200 లీటర్ల పలుపు తోపాటు పది లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా, వాటికి అవసరమైన ముడిసరుకులు అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ దాడుల్లో ప్రత్తిపాడు ఎస్ఈబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.