సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కరానికి చర్యలు
Ens Balu
21
Uppalaguptam
2023-02-17 07:22:23
ప్రస్తుత రబీ సీజన్లో సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కారానికై మండల పంట కాలువల స్థాయిలో బృందాలు నియమించి నిత్యం పర్యవేక్షించనున్నట్టు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు . శుక్రవారం సాగునీటి ఎద్దడి సమస్యలు పరిష్కార సరళిని పరిశీలించేందుకై ఉప్పలగుప్తం వచ్చినట్టు పేర్కొన్నారు. మండల పరిధిలోని కూనవరం డ్రైనేజ్ డివిజన్ పరిధిలోని కొరగనమూడి మైనర్ డ్రైయిన్ పై వేసిన క్రాస్ బండను ఆయన పరిశీలించారు. దీనిలో భాగంగానే డ్రైయిన్లో వేసిన క్రాస్ బండ్లను పరిశీలించి కాలువ చివరి భూము లకు సాగునీరు సరఫరా అవుతున్నది, లేనిది నిత్యం బృందాలు పర్యవేక్షించి, సరఫరా కాబడేలా చర్యలు తీసుకుంటారన్నారు. పంట చివరి దశ వరకు సాగునీరు ఈ బృందాలు పర్యవేక్షణలో సరఫరా చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రాస్ బండి మూలంగా ఎంత మేర విస్తీర్ణ ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతుందని స్థానికoగా వున్న అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉప్పునీరు ఈ డ్రైయిన్ ద్వారా పొలాలకు చేరకుండా కేవలం, బ్యాక్ వాటర్ మాత్రమే పొలాలకు ఈ డ్రైయిన్ మూలంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా సముద్రపు ఆటుపో టులు సమయంలో ఈ డ్రైయిన్ ద్వారా ఉప్పునీరు పంట పొలాలకు చేరకుండా దోహదపడుతుందన్నా రు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ సర్కిల్ ఎస్. ఇ ఇ జి.శ్రీనివాస రావు డ్రైనేజీ డివిజన్ కార్యనిర్వ హక ఇంజనీర్ కె సుబ్బయ్య, జల వనరుల శాఖ సెంట్రల్ డివిజన్ ఇ. ఇ. డి వి రామగోపాల్, డ్రైనేజీ డివిజన్, డివిజనల్ ఇంజనీర్ ఎం వి వి కిషోర్, జల వనరుల శాఖ డి ఇ బి శ్రీనివాసరావు, తాసిల్దార్ జె వెంకటేశ్వరి , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కాకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.