బాధిత కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం..
Ens Balu
21
Gajuwaka
2023-02-17 11:33:16
గాజువాక గంగవరం పోర్టు లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 74 వ వార్డు సిద్దేశ్వరం గ్రామానికి చెందిన గొరుసు సత్యారావు మృతి చెందాడు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద కాంట్రాక్టర్ అప్పారావు, రూ.5 లక్షలు ప్రకటించారు. ఆ మొత్తాన్ని చెక్ రూపంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మృతుడు భార్య అప్పల నరసమ్మ కు వార్డు కార్పొరేటర్ తిప్పల వంశి రెడ్డి ఆధ్వర్యంలో చెక్కును అందజేశారు. బాధితకుటుంబాని అండగా ఉంటామని అదైర్య పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గోరుసు సత్యారావు నాయుడు గోరుసు గురునాధ రెడ్డి గోరుసు చిన్న అప్పారావు గోరుసు సత్యం గోందేశీ తోట సత్యరావు, అప్పారావు సతీష్ , సత్తిరెడ్డి భద్ర ఆనంద్ ప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.