తూ.గో.జి.లో ఎన్నామ్మార్ కార్మికుల వేతనాల సవరణ
Ens Balu
21
Rajamahendravaram
2023-02-17 14:47:49
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎన్. ఎం. ఆర్ (NMR) కార్మికులకు, ఉద్యోగులకు రోజువారీ వేతనాల స్థిరీకరణ,ఉత్తర్వులు మేరకు వారి వేతన సవరణ చేసినట్టు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీ లత పేర్కొన్నారు. రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం
కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఎమ్ ఆర్ ఉద్యోగుల కార్మికులకు చెందిన రోజువారీ వేతనాలను నిర్ణయించే జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న నైపుణ్యం, కొద్ది పాటి నైపుణ్యం, నైపుణ్యత లేని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు కార్మికులు ఆయా నైపుణ్య వర్గాల వారి దినసరి వేతనం నిర్ణ ఇస్తూ కమిటీ ఆమోదం తెలపడం జరిగిందని పేర్కొన్నారు.
నైపుణ్యం కలిగిన వారికి రోజుకు రూ.750/- సెమీ స్కిల్ కలిగిన రోజుకు రూ.565/-, నైపుణ్యత లేని వారికి రోజుకు రూ.525/- ల చొప్పున నిర్ణయం చేస్తూ కమిటీ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈరోజు కమిటీ నిర్ణయం మేరకు ఈ వేతనాలను 2022-23 ఆర్థిక సంవత్సరం నకు అమలు చేయడం తో పాటు, బకాయిలు చెల్లించాలని కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఉత్తర్వులను సర్క్యులేట్ చెయ్య వలసినదిగా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వల్లి ని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ లేబర్ బి ఎస్ ఎం వెళ్లి, ఈ ఈ ఆర్ అండ్ బి. ఎస్ బి వి రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఏ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఇరిగేషన్ తదితరులు పాల్గొన్నారు.