కొయ్యూరు మల్లికార్జున ఆలయంలో భారీ అన్నదానం
Ens Balu
10
Koyyuru
2023-02-18 06:47:51
అల్లూరి జిల్లా కొయ్యూరులో ఎంతో ప్రసిద్దిగావించిన శ్రీబ్రమరాంభిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం మహా శివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. దీనితో వారికి అన్నప్రసాదాలను జిసిసి మాజీ చైర్మన్ ఎంవీపీ ప్రసాద్, పాడేరు టిఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి అనిశెట్టిచిరంజీవి అందించారు. ఈ సందర్భంగా ఎంవీవీ ప్రసాద్ మాట్లాడుతూ, స్వామివారి ఆలయం వద్ద శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. శివరాత్రి పర్వదినం రోజున స్వామిని దర్శించుకుంటే విశేష ఫలితాలు ఉంటాయని, అందునా ఈఏడాది వచ్చిన శివరాత్రి 20ఏళ్ల తరువాత వచ్చిందని అన్నారు. భక్తులందరికీ అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.