భోగి విఘ్నేశ్వరస్వామి పీఠంలో 'శతకోటి'శివనామపారాయణ
Ens Balu
15
Kakinada
2023-02-18 14:14:56
మహాశివరాత్రి సందర్భంగా స్వయంభు కాకినాడ శ్రీవిఘ్నేశ్వర స్వామివారి పీఠంలో శనివారం శతకోటి శివనామపారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెలకొల్పిన ధర్మోకోల్ శివలింగం విశేషంగా అలరించింది. ఉదయం నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శివుడిని దర్శించుకున్నారు. పంచామృతాలతో స్పటిక శివలింగానికి అభిషేకం చేశారు. శివరాత్రి జాగరణ చేపట్టిన పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ, జన్మకోశివరాత్రిగా సృష్టి నిలయం చేసే కాలస్వరూపుని ఆరాధనను ప్రకృతి తత్వంతో చేపట్టాలన్నారు. శివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనం ముక్తిదాయకమన్నారు. భోగి గణపతికి సంపూర్ణ కాంస్య కవచ ధారణ.. 208 కేజీల వరిధాన్యం తో మహాఅన్నాభిషేకం చేపడుతున్నామని తెలిపారు. అనంతరం భక్తులకు అటుకుల ప్యాకెట్లు పంపిణీ చేశారు.