గిరిజన విలేకరుల సంఘం భారీ అన్నసమారాధన
Ens Balu
29
Hukumpeta
2023-02-18 14:30:33
మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా హుకుంపేట మండలం మత్స్యగుండం, అడ్డుమండ లో గిరిజన విలేకరుల (సేవా) సంఘం ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయాల్లో స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల ఆకలి తీర్చడానికి మంచి కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన గిరిజన విలేకరులకు సేవా సంఘం సభ్యులను అభినందించారు. పుణ్యక్షేత్రాల్లో భక్తుల దాహార్తిని తీర్చడానికి చేసిన ఏర్పాట్లు ఎంతో చక్కగా ఉన్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, తశీల్దార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.