ఇలా డోలీలోనే లోకం చూడబోయే ప్రాణాలు
Ens Balu
47
Peda Bayalu
2023-02-20 06:07:34
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ గిరిజన మహి ళలు, వారి కడుపులోని లోకాన్ని చూడబోయే ప్రాణాలు డోలీలో ఊగిసలాడుతున్నాయి. కనీసం గ్రామం నుంచి ప్రధాన రహదారికి వెళ్లడానికి రహదారి లేకపోవడంతో ప్రాణం మీదకు వచ్చిన గర్భిణీ స్త్రీలను అక్కడి గిరిజనులు డోలీలోనే మోసుకెళ్లాల్సిన దుస్తితి ఏర్పడింది. జిల్లాలో పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీకి చెందిన రెంజల మామిడి గ్రామంలో రోడ్డు లేక ఒక నిండు గర్భిణీ స్త్రీ డోలీ మీదనే గ్రామస్తులు ఐదు కిలోమీటర్లు రోడ్డు వర కూ తీసుకు వెళ్లారు. మార్గ మధ్యలో ఏం జరిగినా సేవలు అందించడానికి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూడా డోలీతోనే రోడ్డు వరకూ వెళ్లారు. ఇక్కడి గ్రామస్తులు గమ గ్రామానికి రోడ్డు కావాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికికా ఐటీడీఏకి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో హామీలు ఇచ్చే నేతలు.. తరువాత మళ్లీ సదరు గ్రామాలను కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనితో ఏళ్ల తరబడి కనీస రహదారి సౌకర్యానికి కూడా మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు నోచుకోవడం లేదు.