ఎఫ్.డి.సి ముందస్తు షెడ్యూల్ తెలియజేయాలి
Ens Balu
11
Veeraghattam
2023-02-20 06:36:01
ఫ్యామిలీ డాక్టరు విధానం (ఎఫ్.డి.సి)లో గ్రామాల పర్యటన షెడ్యూల్ ముందుగా తెలియజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు అన్నారు. వీరఘట్టం మండలం నడుకూరు గ్రామంలో సోమ వారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టరు వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బం ది నిర్వహిస్తున్న రిజిస్టర్లు, కేస్ స్టడీ షీట్ లను పరిశీలించారు. వైద్య శిబిరం వద్దకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడారు. వైద్య సేవలు, మందులు అందుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. మందులు సూచనల మేరకు వేసుకోవాలని తద్వారా వ్యాధులు త్వరగా నయం అవుతాయని చెప్పారు. ఆనందంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్యామిలీ డాక్టరు వైద్యానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ప్రేమ ఆప్యాయతతో వైద్య సేవలు అందించాలని డి.ఎం.హెచ్.ఓ వైద్యులు, వైద్య సిబ్బందిని సూచించారు.
వైద్య పరీక్షలు చేసి అవసరమగు మందులు ఇస్తూ సూచనలు పక్కాగా చేయాలని ఆయన చెప్పారు. పౌష్ఠిక ఆహారం గూర్చి వివరించాలని, సంపూర్ణ పోషణ అభియాన్ కిట్లు అందుతున్నదీ లేనిది గుర్తించాలని అన్నారు. బిపి, మధుమేహం, కిడ్నీ, కేన్సర్ వంటి అంటు వ్యాధులు (ఎన్.సి.డి) కాని వాటితో పాటు అంటువ్యాధులు (సి.డి) పై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి డా. ఉమా మహేశ్వరి, డెమో వై. యోగేస్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.