1988 తరువాత తాజాగా దర్శించా..కంచి పీఠాధిపతి
Ens Balu
16
Visakhapatnam
2023-02-20 09:02:29
సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి అత్యంత మహిమాన్వితులని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామిపేర్కొన్నారు. శంకరమఠంలో విడిది చేసియు న్న స్వామిని సోమవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకొని సింహాద్రినాధుడు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి పలు అంశాలు వెల్లడించారు. 1988 తరువాత తాను ఇటీవలే సింహాచలం ఆలయాన్ని సందర్శించి సింహాద్రినాధుడిని దర్శించుకున్నట్టు చెప్పారు. ఆలయంలో శాసనాలను తాను నిశితంగా పరిశీలించానన్నారు. వేద పాఠశాల, గోశాల నిర్వహణ మెరుగ్గా ఉన్నాయని అయితే మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్వామి అభిప్రాయపడ్డారు. సింహాచలం ఆలయ అభివృద్ధిలో ధర్మకర్తలుగా పూర్తి స్థాయిలో సేవలందించి భక్తులు మన్ననలు పొందేలా చూడాలని స్వామి శ్రీనుబాబుకు సూచించారు.