అల్లూరి నడయాడిన ప్రాంతాలపై లోతుగా పరిశోధన జరగాలి


Ens Balu
5
Rampachodavaram
2020-07-04 16:50:57

అల్లూరి పర్యటించిన చారిత్రక ప్రదేశాలపై లోతుగా పరిశోధన జరగాలని అల్లూరిచరిత్ర పరిశోధకులు ఈఎన్ఎస్ బాలు అన్నారు. రంపచోడవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను పరిశోధన చేసిన అంశాలను అల్లూరి మ్యూజింలోకి డాక్యుమెంటరీగా తయారు చేసి అందించనున్నామని చెప్పారు. విశాఖ కలెక్టరేట్ లో ఉన్న అల్లూరికి చెందిన గెజిట్లను ప్రభుత్వం బహిర్గతం చేయాలన్నారు. త్వరలోనే అల్లూరి వెంట నడిచిన సైన్యం కుటుంబాలను కలవనున్నామని వివరించారు. మన్యం పితూరిలో అల్లూరితో పాటు ప్రాణాలు అర్పించిన వారి విషయాలు బాహ్య ప్రపంచానికి నేటికీ తెలియలేదన్నారు. అదేవిధంగా అల్లూరి చరిత్రకి సంబంధించి చాలా విషయాలు మరుగున పడిపోయాయని అన్నారు.అలాంటి చారిత్రిక అంశాలన్నీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో తన పరిశోధన లోతుగా జరుగుతోందన్నారు. ఆరునెలలుగా తూర్పుగోదావరి జిల్లాలో అల్లూరి సంచరించిన ప్రదేశాలన్నీ తిరగడమతో పాటు చాలా కొత్త విషయాలను కనుగొనడం జరిగిందన్నారు. తన పరిశోధన అంశాలన్నీ ఒక పుస్తకరూపంలో తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగున్నాయని బాలు వివరించారు...
సిఫార్సు