ఆదివాసీ గర్భిణీలకు డోలీ మోతలే శరణ్యమా


Ens Balu
16
Paderu
2023-02-20 11:35:20

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక నేటికీ ఆదివాసీ గిరిజనులు డోలీల్లోనే గర్భిణీలను, రోగులను దవాఖానాలకు తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని జనసేన అరకు పార్లమెంటు ఇన్చార్జి వంపూరు గంగులయ్య ఆరోపించారు. ఈరోజు పెదబయలు మండలంలో గుల్లెలు పంచాయతీ శివారు ప్రాంతానికి చెందిన బోండా రాజులమ్మ అనే గర్భిణీని డోలీలోనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఇలాంటివేమీ అధికార వైఎస్సార్సీపీ పార్టీకి కనిపించడం లేదన్నారు. గ్రామాలకు రహదారి సౌకర్యం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, గిరిజనులకు ఉపాది ఈ ప్రభుత్వంలో పూర్తిగా కరువయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఎందరో గిరిజనులు డోలీమోతల్లోనే తనువు చాలించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మారుమూల గ్రామాలకు వైద్యసేవలను కల్పించి ఆదుకోవాలని గంగులయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిఫార్సు