ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీగా పోటి చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్ధి డాక్టర్.కోరెడ్ల రమాప్రభకు మద్దతు ఇవ్వాలంటూ మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణను మద్దతు దారులు కలిశారు. మంగళవారం ఈ మేరకు విశాఖలో ఆయన నివాసానికి వెళ్లి కరపత్రం అందజేశారు. అభ్యర్ధి హామీలను వివరించారు. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిజాయితీ గల నాయకులను చట్టసభలకు పంపాలని అవినీతి రహిత రాజకీయాలు భవిష్యత్తుకి పునాదులు వేస్తాయని అన్నారు. సమాజ అభివృద్దికి మేధావులు , సమాజ సేవకులు చట్టసభల్లో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పిడిఎఫ్ బృందం తరపున కె.లోకనాథం , ఎం.జగ్గునాయుడు , డాక్టర్ బి.గంగారావు ,తదితరులు పాల్గొన్నారు.