చెన్నైలోని జిఎన్ చెట్టి రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట గురువారం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు ఎ జె శేఖర్ పాల్గొన్నారు. ముందుగా విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభానికి రక్షాబంధనం, కళావాహనం చేసి నవధాన్యాలు, నవరత్నాలు, నవలోహాలతో ప్రతిష్ట చేశారు. అదేవిధంగా, కూర్మ, కుబేర, మహాలక్ష్మి యంత్రస్థాపన చేశారు.