నాడు ఈఎన్ఎస్ చెప్పింది.. నేడు నిజమైంది ..


Ens Balu
3
s.rayavaram
2020-09-25 20:45:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరోనా ఖజనాకి కన్నం పెట్టినా.. గ్రామసచివాలయ కార్యదర్శిలకు మహబాగా నాలుగు రాళ్లు వెనుకేసుకేలా చేసింది. చేతికి ఎంత దొరికితే అంతే అడ్డంగా దోచేశారు.. ఇదే సమయంలో ప్రభుత్వ నిధులను పక్కదానికి పట్టించి ఎవరికీ అనుమానం రాకుండా సచివాలయ కార్యదర్శిలు తమ పిల్లలు, భర్తల పేరనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసేకున్నారు. ఈ విషయాన్ని ఎస్.రాయవరం గ్రామసచివాలయ అవకతవకలపై ఈఎన్ఎస్ మూడు నెలల క్రితం వార్తా కథనాలు అందించింది. నేడు నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిణి, ఎస్.రాయవరం గ్రామసచివాలయంలో చేసిన విచారణలో ఆశక్తికర వాస్తవాలువ వెలుగు చూశాయి. కొత్తరేవుపోలవరం కార్యదర్శిగా వున్న ఏవిఎస్ఎస్ ప్రసాద్ ని ఎస్.రాయవరం సచివాలయ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అదే సమయంలో కరోనా వైరస్ విజ్రుంభించడంతో సచివాలయానికి కావాల్సిన బ్లీచింగ్, ఫినాయిల్, శానిటైజర్లు ఇలా అన్నింటిని కొనుగోలు చేయడానికి నేరుగా కార్యదర్శిలు తమ కుటుంబ సభ్యులను వినియోగించుకున్నారనే విషయం డిఎల్పీఓ విచారణలో తేలింది. ఏకంగా 47వేల రూపాయలు సదరు కార్యదర్శి తన కొడుకు బ్యాంకు ఖాతాకి మళ్లించినట్టు రుజువు అయ్యింది. దీంతో సచివాలయంలోని రికార్డలన్నింటినీ డిఎల్పీఓ నర్సీపట్నంలోకి కార్యాలయానికి తీసుకువెళ్లారు. మొత్తం ఎస్.రాయవరం పంచాయతీ రికార్డులు మొత్తం తనిఖీలు చేపడితే మరిన్నివిషయాలు వెలుగు చూసే అవకాశం వుంది.