విమ్స్ సిబ్బందికి హెపటైటిస్ బి వాక్సినేషన్ డ్రైవ్


Ens Balu
15
Visakhapatnam
2023-02-25 14:27:24

హెపటైటిస్ బి వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ వ్యాక్సినేషన్ విమ్స్ సిబ్బందికి పంపిణీ చేసినట్టు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు పేర్కొన్నారు. విశాఖ ఇన్సిట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి వేగంగా వైరస్ సోకే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్  వేస్తున్నామన్నారు.  కేజిహెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సహకారంతో ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ డ్రైవ్ లో 400మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో కే జి హెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్ విమ్స్ ఆర్ ఎం ఓ డాక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు