రేపు పెదగుమ్ములూరులో ఉచిత వైద్య శిభిరం


Ens Balu
12
Payakaraopeta
2023-02-25 14:34:44

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో బిబిఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ వైద్యులు బి.బంగారయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరం ద్వారా వైద్య సేవలను అందించనున్నామన్నారు. ఈ వైద్యశిబిరంలో అన్నిరకాల వ్యాధులకు ప్రముఖ వైద్యులచే ప్రత్యేకంగా పరీక్షించి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. గుండె జబ్బులకు ప్రత్యేక వైద్యులులో పరీక్షలు నిర్వహిస్తామని, అవసరం అయిన వారికి ఈసిజి, బ్లడ్, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు.  ఈ కార్యక్రమాన్ని పెదగుమ్ములూరు చేపల మార్కెట్, అడ్డురోడ్డు తిమ్మాపురం విశాఖడైరీ పాలకేంద్రం ఎదురుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సిఫార్సు