స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధి ఉద్యోగాల్లో స్థిర పడాలని ప్రభుత్వ సలహాదారులు గాది శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇండి యన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (ISTD)జాతీయస్థాయి సొసైటీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ సభ్యులైన శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ సలహా దారులుగా నియమించిన నేపధ్యంలో ఓ హోటల్ లో ఆదివారం ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం JNTU వైస్ ఛాన్సలర్ వెంకట సుబ్బయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసం హెచ్ ఆర్ లు వివరాలు ప్రభుత్వానికి అందించాలని శ్రీధర్ రెడ్డి కోరారు. నూతన ఒరవడితో స్కిల్ ట్రైనింగ్ ద్వారా శిక్షణ పొందిన వారంతా ఆయా రంగాల్లో స్థిరపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ సౌత్ ఫ్రొ.ఎన్.సాంబశివరావు, విశాఖ చాప్టర్ చైర్మన్ ఓఆర్ఎం.రావు, సెక్రటరీ హేమ యాదవల్లి, ఎన్సి మెంబెర్స్ ఠాగూర్, అప్పారావు పాల్గొన్నారు.