వైభవంగా బంగారమ్మతల్లి తీర్థ మహోత్సవం


Ens Balu
9
Simhachalam
2023-02-26 17:07:21

సింహాద్రి నాథుడు సోదరి, అడవివరం పరిసర  14 గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. అప్పన్న సోదరిగా సింహాద్రినాథుడి అనుబంధ దేవాలయంగా బంగారమ్మ తల్లి ఆలయ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందారు. తీర్థ మహోత్సవం సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారినీ సుప్రభాత సేవతో మేల్కొలిపి  ఆరాధన గావించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు.  సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఏఈఓ వై శ్రీనివాసరావు. పర్యవేక్షకులు పిల్లా శ్రీనివాసరావు,  భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. 
సిఫార్సు