వన్యప్రాణులను పరిరక్షించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్నేక్ సేవర్ సొసైటీ వెబ్సైట్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విష సర్పాలను కాపాడడంతోపాటు, వాటి వలన ప్రజలకు హాని కలగకుండా చూస్తున్న రొక్కం కిరణ్ కుమార్ ను అభినందించారు. ఇళ్లలోనూ పరిశ్రమల పరిసర ప్రాంతాలలోనూ సంచరిస్తున్న విష సర్పాలను పట్టుకోవడంలో కిరణ్ కుమార్ ఆరు తేరి ఉన్నాడని అని చెప్పారు. సొసైటీ సేవలను మరింత విస్తరించడానికి వెబ్ సైట్ ను ప్రారంభించటం ముదాహమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 68 వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ తదితరులు పాల్గొన్నారు.