మన జీవన విధానంలో అన్ని దశలలో శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలంటే ప్రోటీన్లు తీసుకోవాలని పోషకాహార నిపుణులు పి. పార్థ సారథి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ ప్రోటీన్ దినోత్సవం పురస్క రించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన శరీరం ప్రోటీన్లు గల ఆహారాన్ని కోరుకుంటాయని అన్నారు. వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు ఎముకలు, చర్మం, మృదులాస్తి, రక్తాన్ని వృద్ధి చేయడంలో సహాయపడతాయని అన్నారు. గుడ్లు, చేపలు, గుమ్మడి గింజలు, బీన్స్, పాల ఉత్పత్తులు, కూరగాయల ద్వారా ప్రోటీన్లు లభిస్తాయి అని పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమం లో అడబాల రత్న ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, బుద్ధరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.