భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారుడిగా వినతికెక్కిన చంద్రశేఖర్ ఆజాద్ దేశ భక్తి ఎనలేనిదని ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్. శ్రీ నగేష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో యువకుల తెగువను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. నాయకుడిలా కాకుండా ఓ సేవకుడిలా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అని తెలిపారు. స్వాతంత్రం అంటే ఆత్మ గౌరవం అని నిరూపించారని అన్నారు. 19 31 ఫిబ్రవరి 27న తన 25 ఏటనే ఆత్మ త్యాగం చేసిన ఆజాద్ దేశభక్తి ఎనలేనిదని శ్రీ నగేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాజా ,రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.