ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తుకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ (FAC)సిహెచ్ నాగ నరసింహారావు చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. డ్రైనేజీలలో షీల్డ్ , రోడ్లపై వేసిన భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని, పారిశుధ్య సమస్య మెరుగుపరచాలని కోరుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కమిషనర్ కు వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పారిశుద్ధ్యం, మంచినీరు, వీధి దీపాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్టు ఆయన వివరించారు.