నిధులు దారిమళ్లింపు కఠిన చర్యలు..!
Ens Balu
3
Visakhapatnam
2020-09-26 14:15:08
గ్రామసచివాలయాల్లో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిణయ సిబ్బందిని హెచ్చరించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఎస్.రాయవరం సచివాలయంలో ఈఓపీఆర్డీ ఏవిఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వ నిధులను తన కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించిన వ్యవహారంలో నర్సీపట్నం డీఎల్పీఓ విచారణ చేపట్టారని, ప్రాధమికం రూ.47 వేలు తన కుమారుడి ఖాతాలోకి మళ్లించినట్టు రుజువైందన్నారు. విచారణ నివేదికను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు చర్యలు నిమిత్తం పంపించనున్నట్టు ఆమె వివరించారు. ఈయనతోపాటు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలు కూడా తమ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి పంచాయతీ నిధులు దారిమళ్లించినట్టు గుర్తించామని, వారిపై చర్యలు తప్పవని డిపిఓ వివరించారు. కరోనా సమయంలో చాలా సచివాలయాల్లో సిబ్బందిని ఫినాయిల్, బ్లీచింగ్, ఇతర ఖర్చుల విషయంలో అధికంగా ఖర్చులు చేసేరా విషయంపై వచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టినట్టు ఆమె వివరించారు. ఎవరైనా నకిలీ బిల్లులు పెట్టినా, నిధులు పక్కదారి పట్టించినా కఠిన చర్యలు తప్పవని డిపిఓ హెచ్చరించారు. కాగా ఎస్.రాయవరం సచివాలయంలో ఈ నిధులతోపాటు మరికొన్ని నిధులు దుర్వినియోగంపైనా లోకాయుక్తాలో కూడా కేసులు నడుస్తుండటం విశేషం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి..